విండోస్ XP, విండోస్ విస్టాలకు ఫైర్‌ఫాక్స్ వెర్షను 52.9.0esr చివరి తోడ్పాటునిచ్చే విడుదల. ఈ నిర్వాహక వ్యవస్థలకు ఇకనుండి ఏ విధమైన భద్రతా నవీకరణలు అందించబడవు.
విండోస్ XP, విస్టా వాడుకరులకు ఫైర్‌ఫాక్స్ తోడ్పాటును ఎందుకు నిలిపివేసింది?
విండోస్ XP, విస్టాలకు తోడ్పాటును ఇస్తున్న చివరి విహారిణుల్లో ఫైర్‌ఫాక్స్ ఒకటి. విండోస్ XPకి తోడ్పాటును 2014 లోనూ, విండోస్ విస్టాకి 2017 లోనూ మైక్రోసాఫ్ట్ వారే నిలిపివేసారు. తోడ్పాటు లేని నిర్వాహక వ్యవస్థలకు భద్రతాపరమైన నవీకరణలు ఉండవు, దోపిడీకి గురయ్యే మార్గాలు తెలిసిపోయివుంటాయి, అవి వాడటానికి ప్రమాదకరం, కనుక వాటి కొరకు ఫైర్‌ఫాక్స్‌ను కొనసాగించడం కష్టమవుతుంది.
వేరే విహారిణి మారితే సురక్షితంగా ఉండగలనా?
దురదృష్టవశాత్తూ లేదు. చాలా విహారిణులు (గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వంటివి) ఇప్పటికే విండోస్ XP, విండోస్ విస్టాలకు తోడ్పాటును నిలిపివేసాయి.
విండోస్ XP, విస్టాలలో నేను ఫైర్‌ఫాక్స్‌తో సురక్షితంగా విహరించగలనా?
దురదృష్టవశాత్తు లేరు. ప్రస్తుతం Firefox Extended Support Release (ESR) వెర్షను 52కి తోడ్పాటు ముగిసింది. తోడ్పాటులేని విహారిణులకు భద్రతాపరమైన నవీకరణలు ఉండవు, అవి దోపిడీకి గురయ్యే మార్గాలు తెలిసిపోయివుంటాయి, వాటిని వాడడం ప్రమాదకరం కూడా.
సరికొత్త ఫైర్‌ఫాక్స్ సౌలభ్యాలను నేను ఎలా పొందగలను?
సరికొత్త సౌలభ్యాలతో సహా మీ ఫైర్‌ఫాక్స్‌ను తాజాగా ఉంచుకోవాలనుకుంటే, మీరు మీ కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను నవీకరించుకోవాలి.
- మైక్రోసాఫ్ట్ ఇంకా తోడ్పాటును అందిస్తూన్న విండోస్ 7, 8 లేదా 10 వంటి విండోస్ వెర్షనుకు నవీకరించుకోండి. ఇక్కడ ఇంకా తెలుసుకోండి. మైక్రోసాఫ్ట్ వారు తోడ్పాటు అందించని విండోస్ వెర్షన్లు వాడటానికి అనిశ్చితమూ అరక్షితమూ, అందువల్ల వాటి కొరకు ఫైర్‌ఫాక్స్‌ను కొనసాగించడం కష్టం కూడా.
- (అధిక స్థాయి): ఒక లినక్స్-ఆధారిత నిర్వాహక వ్యవస్థకు మారండి. మీకు ఆసక్తి ఉన్న లినక్స్ వెర్షను గురించి తెలుసుకునేందుకు తోడ్పాటు వెబ్‌సైట్లను చూడండి.