మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం

Firefox Firefox చివరిగా నవీకరించినది:

ఈ వ్యాసం మాక్ లో ఫైర్‌ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం ఎలా చేయాలో వివరిస్తుంది.

Note: ఈ వ్యాసం మాక్ కు మాత్రమే వర్తిస్తుంది. విండోస్ లో ఫైర్‌ఫాక్స్ స్థాపితం చేయడానికి సూచనల కోసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి? చూడండి.లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపితం చేయడానికి సూచనల కోసం లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్ స్థాపించుకోవడం చూడండి.
మీ ఫైర్‌ఫాక్స్ ఈ ఆవశ్యకతలును నెరవేర్చునట్టు చూసుకోండి. మీరు OS X యొక్క పాత వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, మరింత సమాచారం కోసం ఈ వ్యాసం చూడండి:

మాక్ లో ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుట

  1. ఏ బ్రౌజర్ లో అయినా ఫైర్‌ఫాక్స్ దింపుకోలు పేజీని (ఉదాహరణకు, ఆపిల్ సఫారి) సందర్శించండి. ఇది స్వయంచాలకంగా మీ కంప్యూటర్లో వేదిక మరియు భాషను గుర్తించి, మీ కోసం ఫైర్‌ఫాక్స్ యొక్క ఉత్తమ వెర్షన్ ను సిఫార్సు చేస్తుంది.
  2. ఫైర్‌ఫాక్స్ దించుకోవడానికి ఆకుపచ్చని దింపుకోలు బొత్తాన్ని నొక్కండి.
  3. దింపుకోలు పూర్తి అయిన తరువాత, ఈ (Firefox.dmg) దస్త్రం తనకు తనే తెరచుకొని, ఫైర్‌ఫాక్స్ అనువర్తనము కలిగి వున్న ఫైండర్ విండోని తెరుస్తుంది. ఫైర్‌ఫాక్స్ ప్రతీకాన్ని అనువర్తనాల సంచయంలో నకలు చేయుటకు ప్రతీకాన్ని లాగి సంచయంలో వేయవలెను.
    fxmacinstall
    గమనిక: ఈ విండో మీకు కనపడకపోతే, ఇది తెరవడానికి దింపుకోలు చేసుకున్న Firefox.dmg దస్త్రాన్ని నొక్కండి.
    Mac Install 2
  4. అనువర్తనాల సంచయంలోకి ఫైర్‌ఫాక్స్ ను లాగి, విండోలో నొక్కుతూ control కీని వత్తి పట్టుకోండి మరియు ఈ Eject "Firefox" మెనూ నుండి ఎంచుకోండి .
    Mac Install 4
  5. మీ సౌలభ్యం కోసం ఫైర్‌ఫాక్స్ ను మీ డాక్ కు జోడించవచ్చు. మీ అనువర్తనాల సంచయం తెరిచి డాక్ కు ఫైర్‌ఫాక్స్ ను లాగండి.
    Add to Dock
    ఫైర్‌ఫాక్స్ ఇప్పుడు వినియోగానికి సిద్దంగా వున్నది. దీనిని ప్రారంభించడానికి డాక్ లో దాని యొక్క ప్రతీకాన్ని నొక్కండి.

ఫైర్‌ఫాక్స్ ను మొదటిసారి ప్రారంభించుట

మీరు మొదటి సారిగా ఫైర్‌ఫాక్స్ ను ప్రారంభించినప్పుడు, మీరు జాలం నుండి ఫైర్‌ఫాక్స్ దింపుకోలు చేసారని హెచ్చరిస్తుంది. మీరు అధికారిక సైట్ నుండి ఫైర్‌ఫాక్స్ దింపుకోలు చేసుకున్నందువలన, మీరు ఈ Open బొత్తాన్ని నొక్కవచ్చు.

Firefox Downloaded Security Check Mac

అలాగే, ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణి కాదు మరియు మీకు దాని గురించి గుర్తు చేస్తుంది. అంటే మీరు మీ మెయిల్ అనువర్తనములో ఒక లంకె, ఒక జాల సత్వరమార్గం, లేదా HTML పత్రం తెరిచినప్పుడు, ఫైర్‌ఫాక్స్ లో తెరుచుకోదు. ఫైర్‌ఫాక్స్ గనక ఆ పనులు చేయాలి అని మీరు భావించితే ఈ Use Firefox as my default browser బొత్తాన్ని నొక్కితే ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణిగా అమర్చబడుతుంది. లేనిచో మీరు, ఈ Not now బొత్తాన్ని నొక్కండి.

Firefox as Default Browser Dialogue Mac

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి