మీరు చూస్తున్న లాగిన్ పేజీకి సురక్షితమైన అనుసంధానం లేకపోతే చిరునామా పట్టీలో ఎర్రగీతతో కొట్టివేసిన తాళంకప్ప బొమ్మని ఫైర్ఫాక్స్ చూపిస్తుంది. మీరు టైపు చేసే సంకేతపదం దొంగిలించబడే అవకాశం ఉందని మీకు తెలియజేయడానికే ఆ ఏర్పాటు.
ఫైర్ఫాక్స్ వెర్షను 52తో మొదలుకొని, మీరు వాడుకరి పేరుని లేదా సంకేతపదాన్ని టైపుచేయడానికి లాగిన్ పెట్టెలో నొక్కినప్పుడు, మీకు హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుంది.
గమనిక: మీరు లాగిన్ సమాచారాన్ని టైపుచెయ్యడం మొదలుపెట్టినప్పుడు, హెచ్చరిక సందేశం సంకేతపదం పెట్టెను కప్పేయవచ్చు. ఆ హెచ్చరికను తీసేయడానికి మీరు మీ వాడుకరి పేరు టైపు చేసిన తర్వాత EnterReturn మీటను నొక్కవచ్చు (లేదా సంకేతపదం పెట్టె బయట నొక్కవచ్చు).
లాగిన్ పేజీ సురక్షితం కాకుంటే నేను ఏమి చేయాలి?
మీ అభిమాన సైటు లాగిన్ పేజీ సురక్షితం కాకుంటే, ఆ పేజీకి సురక్షికమైన వెర్షను ఉందేమో అని చిరునామా పట్టీలో URLకు ముందు https:// టైపుచేయడం ద్వారా మీరు ప్రయత్నించి చూడవచ్చు. మీరు వెబ్సైటు నిర్వాహకులను వారి సైటు అనుసంధానాన్ని సురక్షితం చేయమని కూడా సంప్రదించవచ్చు.
సురక్షితం కాని పేజీల గురించి
అంతరంగిక సమాచారాన్ని, అంటే క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత సమాచారం, సంకేతపదాలు లాంటివాటిని, పంపించే పేజీలు మీ సమాచారం దొంగిలించబడకుండా నివారించేందుకు సురక్షిత అనుసంధానంతో ఉండాలి. (చిట్కా: సురక్షిత అనుసంధానం అయితే చిరునామా పట్టీలో ఆకుపచ్చని తాళంకప్ప బొమ్మతో పాటు "HTTPS" అని ఉంటుంది.)
ఎటువంటి అంతరంగిక సమాచారాన్ని పంపించని పేజీలు అరక్షిత అనుసంధాన్ని (HTTP) వాడవచ్చు. చిరునామా పట్టీలో HTTP అని చూపించే జాల పేజీలలో సంకేతపదాల వంటి అంతరంగిక సమాచారాన్ని ఇవ్వడం శ్రేయస్కరం కాదు. అరక్షిత అనుసంధానాలలో మీరు ఇచ్చే సమాచారం దొంగిలించబడవచ్చు.
డెవలపర్లకు గమనిక
ఈ హెచ్చరిక గురించి మరింత తెలుసుకోవాలనుకునే డెవలపర్లు, దయచేసి ఈ పేజీని చూడగలరు. ఫైర్ఫాక్స్ ఎందుకు ఎప్పుడు ఈ హెచ్చరికను చూపిస్తూందో, దీన్ని ఎలా పరిష్కరించాలో కూడా ఆ పేజీ వివరిస్తుంది. ఇంకా అదనపు సమాచారానికి ఈ బ్లాగు టపాను, ఈ సైటు అనుగుణ్యతా పత్రాన్ని చూడండి.